عربيEnglish

The Noble Qur'an Encyclopedia

Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languages

The Chargers [Al-Adiyat] - Telugu translation - Abder-Rahim ibn Muhammad

Surah The Chargers [Al-Adiyat] Ayah 11 Location Maccah Number 100

వగర్చుతూ పరిగెత్తే గుర్రాల సాక్షిగా![1]

తమ ఖురాల తట్టులతో అగ్నికణాలు లేపేవాటి;[1]

తెల్లవారుఝామున దాడి చేసేవాటి;[1]

(మేఘాల వంటి) దుమ్ము లేపుతూ;[1]

(శత్రువుల) సమూహంలో దూరిపోయే వాటి.

నిశ్చయంగా, మానవుడు తన ప్రభువు పట్ల ఎంతో కృతఘ్నుడు.[1]

మరియు నిశ్చయంగా, దీనికి స్వయంగా అతడే సాక్షి.

మరియు నిశ్చయంగా, అతడు సిరిసంపదల వ్యామోహంలో పూర్తిగా మునిగి ఉన్నాడు.

ఏమిటి? అతనికి తెలియదా? గోరీలలో ఉన్నదంతా పెళ్ళగించి బయటికి తీయబడినప్పుడు;[1]

మరియు (మానవుల) హృదయాలలోని విషయాలన్నీ వెల్లడి చేయబడినప్పుడు;

నిశ్చయంగా, ఆ రోజున వారి ప్రభువు వారిని గురించి అంతా తెలుసుకొని ఉంటాడని!