The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThe Calamity [Al-Qaria] - Telugu translation - Abder-Rahim ibn Muhammad
Surah The Calamity [Al-Qaria] Ayah 11 Location Maccah Number 101
ఆ! అదరగొట్టే మహా ఉపద్రవం![1]
ఏమిటా అదరగొట్టే మహా ఉపద్రవం?
మరియు ఆ అదరగొట్టే మహా ఉపద్రవం, అంటే ఏమిటో నీకేం తెలుసు?
ఆ రోజు మానవులు చెల్లాచెదురైన చిమ్మెటల వలే అయిపోతారు.[1]
మరియు పర్వతాలు రంగు రంగుల ఏకిన దూది వలే అయి పోతాయి.[1]
అప్పుడు ఎవడి త్రాసుపళ్ళాలు (సత్కార్యాలతో) బరువుగా ఉంటాయో![1]
అతడు (స్వర్గంలో) సుఖవంతమైన జీవితం గడుపుతాడు.
మరియు ఎవడి (సత్కార్యాల) త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో![1]
అతని నివాసం అధః పాతాళమే.[1]
మరియు అది ఏమిటో నీకేం తెలుసు?
అదొక భగభగమండే అగ్ని (గుండం).[1]