عربيEnglish

The Noble Qur'an Encyclopedia

Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languages

The congregation, Friday [Al-Jumua] - Telugu translation - Abder-Rahim ibn Muhammad

Surah The congregation, Friday [Al-Jumua] Ayah 11 Location Madanah Number 62

ఆకాశాలలో నున్నవి మరియు భూమిలో నున్నవి, సమస్తమూ విశ్వసార్వభౌముడు[1], పరమ పవిత్రుడు, సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు అయన అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి.

ఆయనే ఆ నిరక్ష్యరాస్యులైన[1] వారిలో నుండి ఒక సందేశహరుణ్ణి లేపాడు. అతను వారికి ఆయన సూచనలను (ఆయాత్ లను) చదివి వినిపిస్తున్నాడు మరియు వారిని సంస్కరిస్తున్నాడు మరియు వారికి గ్రంథాన్ని మరియు వివేకాన్ని బోధిస్తున్నాడు. మరియు వాస్తవానికి వారు, అంతకు పూర్వం స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉండేవారు.

మరియు ఇంకా వారిలో చేరని ఇతరులకు కూడా (బోధించటానికి). మరియు ఆయన సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

ఇది అల్లాహ్ అనుగ్రహం, ఆయన దానిని తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ అనుగ్రహశాలి, సర్వోత్తముడు.

తౌరాత్ బాధ్యత (భారం) మోపబడిన తరువాత దానిపై అమలు చేయలేక పోయిన వారి పోలిక, పుస్తకాల భారాన్ని మోసే ఆ గాడిద వలే ఉంది. (వారు ఆ భారాన్ని భరించారే గానీ, దానిని అర్థం చేసుకోలేక పోయారు). అల్లాహ్ సూచన (ఆయాత్) లను తిరస్కరించిన వారి దృష్టాంతము ఎంత చెడ్డది. మరియు అల్లాహ్ దుర్మార్గులకు మార్గదర్శకత్వం చేయడు.

వారితో ఇలా అను: "ఓ యూదులారా! నిశ్చయంగా, ఇతర ప్రజల కంటే మీరు మాత్రమే అల్లాహ్ కు ప్రియమైన వారు (స్నేహితులు) అనే భావం మీకుంటే, మీ (వాదంలో) మీరు సత్యవంతులే అయితే మీరు చావును కోరండి.[1]"

కాని వారు తాము చేసి పంపుకున్న కర్మల (ఫలితాల)కు భయపడి దానిని ఏ మాత్రం కోరుకోరు![1] మరియు అల్లాహ్ కు దుర్మార్గులను గురించి బాగా తెలుసు.

వారితో ఇలా అను: "వాస్తవానికి ఏ చావు నుండి అయితే మీరు పారిపోతున్నారో! నిశ్చయంగా, అదే మిమ్మల్ని పట్టుకుంటుంది. ఆ తరువాత మీరు, అగోచర మరియు గోచర విషయాలు తెలిసిన ఆయన (అల్లాహ్) వైపునకు మరలింపబడతారు, అప్పుడు ఆయన మీరు చేస్తూ ఉండిన కర్మలను మీకు తెలుపుతాడు."

ఓ విశ్వాసులారా! శుక్రవారం (జుముఅహ్) రోజు నమాజ్ కొరకు పిలుపు ఇవ్వబడినప్పుడు, మీరు మీ వ్యాపారాలను విడిచి అల్లాహ్ స్మరణ వైపునకు పరుగెత్తండి. మీరు తెలుసుకోగలిగితే అది మీకు ఎంతో ఉత్తమమమైనది.

ఇక నమాజ్ పూర్తి అయిన తరువాత భూమిలో వ్యాపించండి మరియు అల్లాహ్ అనుగ్రహాన్ని అన్వేషించండి మరియు మీరు సాఫల్యం పొందాలంటే అల్లాహ్ ను అత్యధికంగా స్మరిస్తూ ఉండండి!

మరియు (ఓ ముహమ్మద్!) వారు వ్యాపారాన్ని గానీ లేదా వినోద క్రీడను గానీ చూసినప్పుడు, నిన్ను నిలబడివున్న స్థితిలోనే వదలిపెట్టి, దాని చుట్టు గుమిగూడుతారు.[1] వారితో ఇలా అను: "వినోద క్రీడల కంటే మరియు వ్యాపారం కంటే, అల్లాహ్ వద్ద ఉన్నదే ఎంతో ఉత్తమమైనది. మరియు అల్లాహ్ యే జీవనోపాధి ప్రసాదించటంలో అత్యుత్తముడు."