عربيEnglish

The Noble Qur'an Encyclopedia

Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languages

The cloaked one [Al-Muddathir] - Telugu translation - Abder-Rahim ibn Muhammad

Surah The cloaked one [Al-Muddathir] Ayah 56 Location Maccah Number 74

ఓ దుప్పటిలో చుట్టుకున్నవాడా!

లే! ఇక హెచ్చరించు!

మరియు మీ ప్రభువు గొప్పతనాన్ని (ఘనతను) కొనియాడు (చాటి చెప్పు)!

మరియు నీ వస్త్రాలను పరిశుభ్రంగా ఉంచుకో!

మరియు మాలిన్యానికి దూరంగా ఉండు!

మరియు ఎక్కువ పొందాలనే ఆశతో ఇవ్వకు (ఉపకారం చేయకు)!

మరియు నీ ప్రభువు కొరకు సహనం వహించు!

మరియు బాకా (నాఖూర్) ఊదబడినప్పుడు;

ఆ దినం చాలా కఠినమైన దినమై ఉంటుంది;

సత్యతిరస్కారులకు అది సులభమైన (దినం) కాదు[1].

వదలండి! నన్నూ మరియు నేను ఒంటరిగా పుట్టించిన వానినీ[1]!

మరియు నేను అతనికి పుష్కలంగా సంపదనిచ్చాను.

మరియు అతనికి తోడుగా ఉండే కుమారులను!

మరియు అతను కొరకు అతని జీవన సౌకర్యాలను సులభం చేశాను.

అయినా నేను అతనికి ఇంకా ఇవ్వాలని అతడు ఆశిస్తూ ఉంటాడు.

అలా కాదు! వాస్తవానికి అతడు మా (అల్లాహ్) సూచనల (ఆయాత్ ల) పట్ల విరోధం కలిగి వున్నాడు.

నేను త్వరలోనే అతనిని దుర్గమమైన స్థానానికి (శిక్షకు) నెట్టుతాను!

వాస్తవానికి, అతడు ఆలోచించాడు మరియు మనస్సులో ప్రణాళిక చేసుకున్నాడు.

కావున (అతనిని) తాను ప్రణాళిక చేసుకున్నట్లు నాశనానికి గురి కానివ్వండి!

అవును (అతనిని) తాను ప్రణాళిక చేసుకున్నట్లు, నాశనానికి గురి కానివ్వండి!

అప్పుడు అతడు ఆలోచించాడు.

తరువాత అతడు నుదరు చిట్లించుకున్నాడు మరియు కోపంతో చూశాడు (ముఖం మాడ్చుకున్నాడు);

తరువాత అతడు వెనుకకు మరలి దురహంకారం చూపాడు[1].

అప్పుడు అతడు ఇలా అన్నాడు: "ఇది పూర్వ నుండి వస్తూ వున్న ఒక మంత్రజాలం మాత్రమే!

ఇది కేవలం ఒక మానవ హక్కు మాత్రమే

త్వరలోనే నేను అతనిని నరకాగ్నిలో కాల్చుతాను.

మరియు ఆ నరకాగ్ని అంటే నీవు ఏమనుకుంటున్నావు[1]?

అది (ఎవరినీ) మిగల్చదు మరియు వదలి పెట్టదు[1].

అది మానవుణ్ణి (అతడి చర్మాన్ని0 దహించి వేస్తుంది[1].

దానిపై పందొమ్మిది (దేవదూతలు నియమించబడి) ఉన్నారు.

మరియు మేము దేవదూతలను మాత్రమే నరకానికి రక్షకులుగా నియమించాము. మరియు మేము వారి సంఖ్యను (పందొమ్మిదిని), సత్యతిరస్కారులకు ఒక పరీక్షగా, గ్రంథ ప్రజలకు నమ్మకం కలగటానికి, విశ్వాసుల విశ్వాసాన్ని అధికం చేయటానికి మరియు గ్రంథ ప్రజలు మరియు విశ్వాసులు సందేహంలో పడకుండా ఉండటానికి మరియు తమ హృదయాలలో రోగమున్న వారు మరియు సత్యతిరస్కారులు: "ఈ ఉపమానం ఇవ్వటంలో అల్లాహ్ ఉద్దేశమేమిటి?" అని పలుకటానికి! ఈ విధంగా అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు. మరియు తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు[1]. మరియు నీ ప్రభూవు సైన్యాలను ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు ఇదంతా మానవునికి ఒక జ్ఞాపిక మాత్రమే.

అలా కాదు! చంద్రుని సాక్షిగా!

గడిచిపోయే రాత్రి సాక్షిగా!

ప్రకాశించే, ఉదయం సాక్షిగా!

నిశ్చయంగా, ఇది (ఈ నరకాగ్ని ప్రస్తావన) ఒక గొప్ప విషయం.

మానవునికి ఒక హెచ్చరిక;

మీలో ముందుకు రావాలని కోరుకునే వానికి లేదా వెనుక ఉండి పోయేవానికి;

ప్రతి మానవుడు తాను చేసిన కర్మలకు తాకట్టుగా ఉంటాడు.

కుడిపక్షం వారు తప్ప!

వారు స్వర్గాలలో ఉంటూ ఒకరినొకరు ఇలా ప్రశ్నించుకుంటారు!

అపరాధులను గురించి (మరియు వారితో అంటారు):

"మిమ్మల్ని ఏ విషయం నరకంలోకి ప్రవేశింపజేసింది?"

వారు (నరకవాసులు) ఇలా జవాబిస్తారు: "మేము నమాజ్ చేసే వాళ్ళం కాము.

మరియు నిరుపేదలకు ఆహారం పెట్టేవాళ్ళం కాము;

మరియు వృథా కాలక్షేపం చేసే వారితో కలిసి వ్యర్థ ప్రలాపాలు (ప్రసంగాలు) చేస్తూ ఉండే వాళ్ళము;

మరియు తీర్పుదినాన్ని అబద్ధమని నిరాకరిస్తూ ఉండేవాళ్ళము;

చివరకు ఆ అనివార్యమైన ఘడియ మాపై వచ్చి పడింది[1].

అప్పుడు సిఫారసు చేసేవారి సిఫారసు వారికి ఏ మాత్రం ఉపయోగపడదు[1].

అయితే, వారికేమయింది? ఈ హితోపదేశం నుండి వారెందుకు ముఖం త్రిప్పుకుంటున్నారు.

వారి స్థితి బెదిరిన అడవి గాడిదల మాదిరిగా ఉంది;

సింహం నుండి పారిపోయే (గాడిదల మాదిరిగా)[1]!

అలా కాదు! వారిలో ప్రతి ఒక్క వ్యక్తి తనకు విప్పబడిన గ్రంథాలు ఇవ్వబడాలని కోరుతున్నాడు[1].

కాదు! కాదు! అసలు వారు పరలోక జీవితం గురించి భయపడటం లేదు.

అలా కాదు! నిశ్చయంగా, ఇది ఒక హితోపదేశం.

కావున కోరినవాడు దీని నుండి హితబోధ గ్రహించవచ్చు.

కాని అల్లాహ్ కోరితే తప్ప! వీరు దీని నుండి హితబోధ గ్రహించలేరు. ఆయనే (అల్లాహ్ యే) భయభక్తులకు అర్హుడు మరియు ఆయనే క్షమించే అర్హత గలవాడు[1].