The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThose who drag forth [An-Naziat] - Telugu translation - Abder-Rahim ibn Muhammad
Surah Those who drag forth [An-Naziat] Ayah 46 Location Maccah Number 79
(అవిశ్వాసుల ప్రాణాలను) కఠినంగా లాగి తీసే వారి (దేవదూతల) సాక్షిగా![1]
(విశ్వాసుల ప్రాణాలను) నెమ్మదిగా తీసేవారి (దేవదూతల) సాక్షిగా![1]
(విశ్వంలో) తేలియాడుతూ పోయే వారి సాక్షిగా![1]
మరియు పందెంలో వలే (ఒకరితో నొకరు) పోటీ పడే వారి సాక్షిగా!
మరియు (తమ ప్రభువు) ఆజ్ఞానుసారం వ్యవహారాలు నిర్వహించేవారి (దేవదూతల) సాక్షిగా!
ఆ రోజు (మొదటి) బాకా ధ్వని భూగోళాన్ని తీవ్రంగా కంపింపజేస్తుంది.[1]
దాని తర్వాత రెండవ సారి[1] బాకా ఊదబడుతుంది. (అప్పుడు అందరూ పునరుత్థరింప బడతారు).
ఆ రోజు (కొన్ని) హృదయాలు (భయంతో) దడదడలాడుతూ ఉంటాయి.
వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి.
వారు ఇలా అంటున్నారు: "ఏమీ? మనం మన పూర్వ స్థితిలోకి మళ్ళీ తీసుకు రాబడతామా?
మనం శిథిలమైన ఎముకలుగా మారి పోయిన తరువాత కూడానా?"
వారు (ఇంకా ఇలా) అంటారు: "అయితే ఈ తిరిగి రావటమనేది చాల నష్టదాయకమైనదే!"
కాని అది వాస్తవానికి, ఒకే ఒక (తీవ్రమైన) ధ్వని.
అప్పుడు వారందరూ, ఒకేసారి లేచి మైదానంలోకి వచ్చి ఉంటారు.
ఏమీ? నీకు మూసా వృత్తాంతం అందిందా[1]?
అతని ప్రభువు పవిత్ర తువా లోయలో అతనిని పిలిచినప్పుడు,[1]
(ఇలా అన్నాడు): "ఫిర్ఔన్ వద్దకు వెళ్ళు, నిశ్చయంగా, అతడు ధిక్కారుడయ్యాడు.
"ఇక (అతనితో) ఇట్లను: 'ఏమీ? నీవు పాపరహితుడవు అవటానికి ఇష్టపడతావా?
మరియు నేను నీకు నీ ప్రభువు వైపునకు మార్గదర్శకత్వం చేస్తాను, మరి నీవు ఆయన పట్ల భీతి కలిగి ఉంటావా?'"
తరువాత అతను (మూసా) అతడికి (ఫిర్ఔన్ కు) గొప్ప అద్భుత నిదర్శనాన్ని చూపాడు.
కాని అతడు (ఫిర్ఔన్) దానిని అబద్ధమని తిరస్కరించాడు మరియు (అతని మాటను) ఉల్లంఘించాడు.
ఆ తర్వాత అతడు (ఫిర్ఔన్) వెనక్కి మరలి పోయి, (కుట్రలు) పన్నసాగాడు.
పిదప (ప్రజలను) సమావేశపరచి, ఎలుగెత్తి చాటుతూ;
ఇలా అన్నాడు: "నేనే మీ యొక్క మహాన్నత ప్రభువును!"[1]
కావున అల్లాహ్ అతనిని ఇహపరలోకాల శిక్షకు గురి చేశాడు.[1]
నిశ్చయంగా, ఇందులో (అల్లాహ్ కు) భయపడే ప్రతి వ్యక్తి కొరకు గుణపాఠముంది.
ఏమీ? మిమ్మల్ని సృష్టించడం కఠినమయిన పనా? లేక ఆకాశాన్నా? ఆయనే కదా దానిని నిర్మించింది![1]
ఆయన దాని కప్పు (ఎత్తు)ను చాలా పైకి లేపాడు. తరువాత దానిని క్రమపరిచాడు;
మరియు ఆయన దాని రాత్రిని చీకటిగా చేశాడు. మరియు దాని పగటిని (వెలుగును) బహిర్గతం చేశాడు.
మరియు ఆ పిదప భూమిని పరచినట్లు చేశాడు[1].
దాని నుండి దాని నీళ్ళను మరియు దాని పచ్చికను బయటికి తీశాడు;
మరియు పర్వతాలను (దానిలో) స్థిరంగా నాటాడు;
మీకు మరియు మీ పశువులకు జీవన సామగ్రిగా[1]!
ఇక ఆ గొప్ప దుర్ఘటన (పునరుత్థాన దినం) వచ్చినప్పుడు;
ఆ రోజు మానవుడు తాను చేసిందంతా జ్ఞాపకం చేసుకుంటాడు;
మరియు చూసే వారి యెదుటకు, నరకాగ్ని స్పష్టంగా కనబడేటట్లు తేబడుతుంది. [1]
ఇక ధిక్కారంతో హద్దులు మీరి ప్రవర్తించిన వాడికి;
మరియు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిచ్చిన వాడికి;
నిశ్చయంగా, నరకాగ్నియే, వాని నివాస స్థానమవుతుంది!
మరియు తన ప్రభువు ముందు నిలబడ వలసి వుంటుందన్న భయంతో తన మనస్సును దుష్టవాంఛలకు దూరంగా ఉంచిన వ్యక్తికి;
నిశ్చయంగా, స్వర్గమే, అతని నివాస స్థానమవుతుంది!
(ఓ ముహమ్మద్!) వీరు నిన్ను - ఆ ఘడియను గురించి: "అసలు అది ఎప్పుడొస్తుంది?" అని అడుగుతున్నారు.
దాని గురించి చెప్పడానికి దాంతో నీకేమి సంబంధం?
దాని వాస్తవ జ్ఞానం నీ ప్రభువుకే ఉంది!
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, నీవు, దానికి భయపడే వారిని హెచ్చరించే వాడవు మాత్రమే!
వారు దానిని చూసిన రోజు (తాము ప్రపంచంలో) కేవలం ఒక సాయంత్రమో లేక ఒక ఉదయమో గడిపినట్లు భావిస్తారు[1].