عربيEnglish

The Noble Qur'an Encyclopedia

Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languages

The Mansions of the stars [Al-Burooj] - Telugu translation - Abder-Rahim ibn Muhammad

Surah The Mansions of the stars [Al-Burooj] Ayah 22 Location Maccah Number 85

విస్తారమైన తారాగణం గల ఆకాశం సాక్షిగా![1]

వాగ్దానం చేయబడిన (పునరుత్థాన) దినం సాక్షిగా!

చూచేదాని (దినం) మరియు చూడబడే దాని (దినం) సాక్షిగా![1]

అగ్ని కందకం (ఉఖూద్) వారు నాశనం చేయబడ్డారు.[1]

ఇంధనంతో తీవ్రంగా మండే అగ్నిని రాజేసేవారు.

వారు దాని (ఆ కందకం) అంచుపై కూర్చొని ఉన్నప్పుడు;[1]

మరియు తాము విశ్వాసుల పట్ల చేసే ఘోర కార్యాలను (సజీవ దహనాలను) తిలకించేవారు.

మరియు వారు విశ్వాసుల పట్ల కసి పెంచుకోవడానికి కారణం - వారు (విశ్వాసులు) సర్వశక్తిమంతుడు, సర్వ స్తోత్రాలకు అర్హుడైన - అల్లాహ్ ను విశ్వసించడం మాత్రమే!

ఆయనే! ఎవరికైతే భూమ్యాకాశాల ఆధిపత్యం ఉందో! మరియు అల్లాహ్ యే ప్రతిదానికి సాక్షి.

ఎవరైతే విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను హింసిస్తారో, ఆ తరువాత పశ్చాత్తాపంతో క్షమాపణ కోరరో! నిశ్చయంగా, అలాంటి వారికి నరకశిక్ష ఉంటుంది. మరియు వారికి మండే నరకాగ్ని శిక్ష విధించబడుతుంది.

నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసేవారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలు ఉంటాయి[1]. అదే గొప్ప విజయం.

నిశ్చయంగా, నీ ప్రభువు యొక్క పట్టు (శిక్ష) చాలా కఠినమైనది.[1]

నిశ్చయంగా, ఆయనే (సృష్టిని) ఆరంభించేవాడు మరియు ఆయనే (దానిని) మరల ఉనికిలోకి తెచ్చేవాడు.

మరియు ఆయన క్షమాశీలుడు, అమిత వాత్సల్యుడు.

సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్టించిన వాడు,[1] మహత్త్వపూర్ణుడు.[2]

తాను తలచింది చేయగలవాడు.

ఏమీ? సైన్యాల వారి సమాచారం నీకు అందిందా?

ఫిర్ఔన్ మరియు సమూద్ వారి (సైన్యాల).

అలా కాదు, సత్యతిరస్కారులు (సత్యాన్ని) తిరస్కరించుటలో నిమగ్నులై ఉన్నారు.

మరియు అల్లాహ్ వారిని వెనుక (ప్రతి దిక్కు) నుండి చుట్టుముట్టి ఉన్నాడు.

వాస్తవానికి, ఇది ఒక దివ్యమైన[1] ఖుర్ఆన్.

సురక్షితమైన ఫలకం (లౌహె మహ్ ఫూజ్)[1] లో (వ్రాయబడి) ఉన్నది.