The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThe morning star [At-Tariq] - Telugu translation - Abder-Rahim ibn Muhammad
Surah The morning star [At-Tariq] Ayah 17 Location Maccah Number 86
ఆకాశం మరియు రాత్రివేళ వచ్చే నక్షత్రం (అత్ తారిఖ్) సాక్షిగా![1]
రాత్రి వేళ వచ్చేది (అత్ తారిఖ్) అంటే ఏమిటో నీకు ఎలా తెలుస్తుంది?
అదొక అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం.
కనిపెట్టుకొని ఉండేవాడు (దేవదూత) లేకుండా ఏ వ్యక్తి కూడా లేడు.
కావున మానవుడు తాను దేనితో సృష్టించబడ్డాడో గమనించాలి!
అతడు విసర్జించబడే (చిమ్ముకుంటూ వెలువడే) ద్రవపదార్థంతో సృష్టించబడ్డాడు.
అది వెన్ను మరియు రొమ్ము ఎముకల మధ్యభాగం నుండి బయటికి వస్తుంది.
నిశ్చయంగా, ఆయన (సృష్టికర్త), అతనిని మరల బ్రతికించి తేగల సామర్థ్యం గలవాడు!
ఏ రోజయితే రహస్య విషయాల విచారణ జరుగుతుందో!
అప్పుడు అతనికి (మానవునికి) ఎలాంటి శక్తి ఉండదు మరియు ఏ సహాయకుడునూ ఉండడు.[1]
వర్షం కురిపించే ఆకాశం సాక్షిగా![1]
(చెట్లు మొలకెత్తేటప్పుడు) చీలి పోయే భూమి సాక్షిగా!
నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్, సత్యాసత్యాలను) వేరు పరచే వాక్కు (గీటురాయి).
మరియు ఇది వృథా కాలక్షేపానికి వచ్చినది కాదు.
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, వారు (నీకు విరుద్ధంగా) కుట్రపన్నుతున్నారు.[1]
మరియు నేను కూడా పన్నాగం పన్నుతున్నాను.
కనుక నీవు సత్యతిరస్కారులకు కొంత వ్యవధినివ్వు![1] వారి పట్ల మృదువుగా వ్యవహరించు.