The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThe night [Al-Lail] - Telugu translation - Abder-Rahim ibn Muhammad
Surah The night [Al-Lail] Ayah 21 Location Maccah Number 92
క్రమ్ముకునే రాత్రి సాక్షిగా!
ప్రకాశించే పగటి సాక్షిగా!
మరియు, మగ మరియు ఆడ (జాతులను) సృష్టించిన ఆయన (అల్లాహ్) సాక్షిగా!
వాస్తవానికి, మీ ప్రయత్నాలు నానా విధాలుగా ఉన్నాయి;[1]
కాని ఎవడైతే (దానధర్మాలు) చేస్తూ దైవభీతి కలిగి ఉంటాడో!
మరియు మంచిని నమ్ముతాడో![1]
అతనికి మేము మేలు కొరకు దానిరి సులభం చేస్తాము.[1]
కాని ఎవడైతే పిసినారితనం చేస్తూ, నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తాడో![1]
మరియు మంచిని అబద్ధమని తిరస్కరిస్తాడో!
అతనికి మేము చెడు కొరకు దారిని సులభం చేస్తాము.
మరియు అతడు నశించి పోయినప్పుడు, అతని ధనం అతనికి ఎలా ఉపయోగపడుతుంది?
నిశ్చయంగా, సన్మార్గం చూపడం మా పని!
మరియు నిశ్చయంగా, ఇహపరలోకాల (ఆధిపత్యం) మాకే చెందినది.
కాబట్టి నేను మిమ్మల్ని ప్రజ్వలించే నరకాగ్నిని గురించి హెచ్చరించాను.
పరమ దౌర్భాగ్యుడు తప్ప, మరెవ్వడూ అందులో కాలడు!
ఎవడైతే (సత్యాన్ని) తిరస్కరించి (దాని నుండి) విముఖుడవుతాడో!
కాని దైవభీతి గలవాడు దాని నుండి (ఆ నరకాగ్ని నుండి) దూరంగా ఉంచబడతాడు!
అతడే! ఎవడైతే, పవిత్రుడవటానికి తన ధనం నుండి (ఇతరులకు) ఇస్తాడో!
కాని అది, వారు అతనికి చేసిన ఏ ఉపకారానికి బదులుగా గాక;
కేవలం మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అయితే!
మరియు అలాంటి వాడే తప్పక సంతోషిస్తాడు.[1]